సెక్రటేరియట్ కూల్చివేత... 27వ తేదీన భూమి పూజ || Oneindia Telugu

2019-06-19 2

CM K Chandrasekhar Rao said that it is decided to construct a new assembly complex in Erra Manzil and new buildings in the existing Secretariat. Chandrasekhar Rao has announced that he will be going fot land worshiping on the 27th of this month.
#telangana
#secretariat
#demolition
#buildings
#cmkcr
#department
#assembly
#committee

తెలంగాణాలో భవంతుల నిర్మాణాల సీజన్ కనిపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం, ఎమ్మెల్యేలకు నూతన గృహ నిర్మాణాలు, ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం శాసన సభ, సచివాలయ భవంతుల నిర్మణాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఎర్ర మంజిల్ లో నూతన అసెంబ్లీ సముదాయాన్ని, ఇప్పుడున్న సచివాలయంలో కొత్త భవనాలు నిర్మాణం చేయాలని నిర్ణయించామని సీఎం కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన భూమి పూజ చేస్తున్నామని చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సచివాలయ భవనాలు పూర్తిగా కూల్చివేయాలా, పాక్షికంగా కూల్చివేయాలా అనే దానిపై ఆర్ అండ్ బీ మంత్రి నేతృత్వంలో కమిటీ వేస్తున్నామని, కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకువెళ్తామని అన్నారు. పాత అసెంబ్లీ భవనం నమూనాలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం ఉంటుందని, ఆ ప్రకారంగానే డిజైన్ రూపొందిస్తున్నారన్నారు. 100 కోట్ల రూపాయల చొప్పున అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం చేస్తామన్నారు.